మనిషి దైవస్వరూపాలను భక్తితో ఆరాధిస్తాడు. కొన్ని దైవస్వరూపాలను మాత్రం భయభక్తులతో ఆరాధిస్తాడు. ఆ కొన్ని దైవస్వరూపాలే నవగ్రహాలు!
తన జాతక చక్రంలో కొలువుదీరి, జీవిత చక్రాన్ని నడిపే నవగ్రహ దేవతలను భయంతో, భక్తితో సేవించడం మనిషి నైజంగా మారింది. తల్లి గర్భంలో పడినప్పటి నుండి, కాల గర్భంలో కలిసిపోయేదాకా మానవ జీవనయానం పూర్తిగా నవగ్రహాల ప్రభావం మీద ఆధారపడి వుంటుంది. మనిషి ఆలోచనలకూ, అభివ్యక్తీకరణకూ, ఆచరణకూ మలూం గ్రహవీక్షణే అంటున్నాయి శాస్త్రాలు. నవగ్రహాల గురించి సంపూర్ణంగా తెలుసుకుని ఆరాధించడం మంచిది. ఆ గ్రహాల అవతార రహస్యాలు అద్భుతాలు. చరిత్రలు పదమాద్భుతాలు. మహిమలు మహాద్భుతాలు. ఇన్ని అద్భుతాల సమాహారమే మీ చేతిలో ఉన్న నవగ్రహపురాణం. తేనెలసోనల తెలుగులో, ఉత్కంఠను రేకెత్తించే శైలితో ప్రసిద్ధ రచయిత వక్కంతం సూర్యనారాయణరావ్‌ ఆవిష్కరించిన దార్శనిక అక్షర దర్పణం, నవగ్రహాల చరిత్రలను విపులంగా అందించే ఏకైక గ్రంథం ఇది. నవగ్రహ పురాణ పఠనం నవగ్రహ ఆరాధనతో సమానం అన్నారు అనుభవజ్ఞులు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good