గతజన్మలో మనం చేసే పుణ్యపాప కర్మల ఫలితంగా ఈ జన్మలో ఎన్నో కష్టాలు పడుతూ వుంటాం. సుఖాలనూ అనుభవిస్తుంటాం. ఇవన్నీ మనిషి పుట్టింది మొదలు తత్కాల గ్రహస్థితిని అనుసరించి అతడి జాతకలగ్నం, రాశి, నక్షత్రం నిర్ణయించబడి, తదనుగుణంగానే ఆయాగ్రహాల దశలు సంప్రాప్తించటం. ఆయాదశల్లో ఉన్న గ్రహస్థితికి అనుగుణంగా కష్టసుఖాలు అనుభవించటం జరుగుతుంది.

సుఖాలు వస్తే సరే మరి కష్టాలు వస్తే ఎలా? వాటి నుంచి నివారణ పొందటం ఎలా? అని ఆలోచిస్తే ఈ కష్టాలను కర్మానుసారం మనకి కలిగించేవి నవగ్రహాలు కాబట్టి. ఈ నవగ్రహాలలో ఏ దశలో మనకి ఏ గ్రహం అనుకూలంగా లేదో జ్యోతిషుల ద్వారా తెల్సుకుని, ఆయా గ్రహాలని స్తోత్రాల ద్వారా స్తుతించి ప్రసన్నం చేసుకోవాలి.

మానవుడైనా మాధవుడైనా స్తుతి ద్వారా సంతృప్తి చెందుతారు కాబట్టి నవగ్రహ దోషాలున్నవారు ఈ గ్రంథంలో తెలిపిన నవగ్రహ స్తోత్రాలని భక్తిశ్రద్ధలతో పఠించి, ఆయాగ్రహాల అనుగ్రహాన్ని పొంది కృతార్ధులు కావలసిందిగా కోరుతున్నాం.
- ప్రకాశకులు

Write a review

Note: HTML is not translated!
Bad           Good