భారతీయ మార్క్సిస్టు మేధావుల్లో రాహుల్‌ సాంకృత్యాయన్‌ స్థానం చాలా విశిష్టమైంది. ఆయన బౌద్ధ సాహిత్యంలో మహా పండితుడు. ఆది బౌద్ధానికి ఆధార గ్రంథాలుగా భావించే త్రిపిటకాల్లో ఆయన పాండిత్యం అసాధారణమైంది. అందుకే శ్రీలంకలోని బౌద్ధ విశ్వవిద్యాలయం ''త్రిపిటకాచార్య''గా సన్మానించింది. ఆయన బౌద్ధానికి సంబంధించి ఏదో ఒక దశ గురించి మాత్రమే అధ్యయనం చేయలేదు. దాదాపు 2600 సంవత్సరాల బౌద్ధ చరిత్రలో ఆయన మహా పండితుడు, మహా పరిశోధకుడు. అటువంటి రాహుల్‌ సాంకృత్యాయన్‌ డా|| అంబేద్కర్‌ బౌద్ధధర్మ దీక్షను సాంప్రదాయికార్థంలో కేవలం మతమార్పిడిగా భావించి, సామాజిక, ఆర్థిక సమస్యకు అది అశాస్త్రీయ పరిష్కారంగా తిరస్కరించలేదు. డా|| అంబేద్కర్‌ బౌద్ధధర్మ స్వీకారం వల్ల కలిగిన ప్రయోజనాల్ని గుర్తించిన తొలి మార్క్సిస్టు దార్శనికుడు రాహుల్‌ సాంకృత్యాయన్‌. భారతీయ మార్క్సిఉ్టల్లో డా||అంబేద్కర్‌ బౌద్ధధర్మ స్వీకారాన్ని సానుభూతితో ఆహ్వానించిన రాహుల్‌ సాంకృత్యాయన్‌ జన్మత: సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆర్యసమాజవాదిగా మారి, బౌద్ధుడై (కుల రహితుడై), మార్క్సిస్టుగా రూపాంతరం చెందిన ఆయన డా|| అంబేద్కర్‌ హృదయాన్ని అర్థం చేసుకున్న మానవతామూర్తి. మత మార్పిడి వల్ల భారతీయతకు, దళిత ప్రజలకు, ఈ దేశ సాంస్కృతిక వారసత్వానికి ఒనగూడిన ప్రయోజనాల్ని గుర్తించి రాహుల్‌ సాంకృత్యాయన్‌ నవదీక్షిత బౌద్ధులు రచించారు. భౌతికవాదులకు, ఆర్థికవాదులకు కుల రహిత, దైవ రహిత, మానవవాద మతం-బౌద్ధం పునరుద్ధరించబడడం వల్ల కలిగే ప్రయోజనం అంత తేలికగా అర్తం కాదు. భారతదేశ చరిత్రను లోతుగా పరిశీలించిన రాహుల్‌ సాంకృత్యాయన్‌ లాంటి వారికే అది సాధ్యం. - టి.రవిచంద్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good