తెలుగు నాటకరంగ తొలి చరిత్రకారుడు పురాణం సూరిశాస్త్రి. విస్తృత ప్రాచ్య, పాశ్చాత్య నాటక సాహిత్య పరిచయం, విజ్ఞాన శాస్త్ర అధ్యయనం నేర్పిన విశ్లేషణా పద్ధతుల అవగాహన, కళౄపారమ్యం ఎరిగిన విచక్షణశీలత - ఈ లక్షణాలు ప్రాతిపదికగా శాస్త్రిగారు ఆరు విమర్శనా సమీక్షా గ్రంథాలను రచించారు. అందులో రెండు గ్రంథాలు - ''నాట్యాంబుజము'', ''నాట్య అశోకము'' - తెలుగు నాటక విమర్శకు మార్గదర్శకాలైన తొలి రచనలు. ఆ రెండింటిలోను 1890-1923 మధ్యకాలంలో తెలుగు నాటకాలు, నటులు, సమాజాలను గురించిన విస్తృత చర్చ, తులనాత్మక పరిశీలన కనిపిస్తాయి. ఈనాటి నాటకాభిమానులకు ఒకనాటి తెలుగు నటులను, రచయితలను, నాటకాలను గురించి విమర్శనాత్మకంగా వివరిస్తాయి. సమకాలీనమైన తాత్కాలిక వాదోపవాదులను పరిహరించి, అవసరమైన చోట్ల అథోసూచికలను, వివరణలను చేర్చిన ఈ రెండు గ్రంథాల సంస్కరణ ప్రతి నాటక విద్యార్ధులకు, విమర్శకులకు, అధ్యాపకులకు, నాటకాభిమానులకు స్ఫూర్తినిస్తుందని మా ఆశ. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good