ఆరోగ్య నియమాలు

ప్రతిరోజూ సూర్యోదయానికి ముందుగా లేవవలెను. మలమూత్ర విసర్జనా నంతరం కనీసం 3 కి.మీ. అయినా షికారుగా వెళ్ళి వచ్చుట మంచిది.

సాయంకాలం (లేక రాత్రి) భోజనం అయిన తర్వాత కూడా 1 కి.మీ. నడుచుట మంచిది.

రాత్రిపూట భోజనం నిద్రించుటకు 3 గంటల ముందుగా చేయుచుండవలెను.

రాత్రి 10 గంటలు దాటకుండా నిద్రపోవలెను. రాత్రిళ్ళు బాగా పొద్దుపోయే దాకా మేల్కొనుచుండిన ఎడల ఆరోగ్యం చెడును.

ఆహారం బాగా నమిలి మ్రింగవలెను.

స్నానము చేసిన వెంటనే భోజనం చేయరాదు. అట్లు చేసిన జీర్ణశక్తి చెడిపోవును. కావున స్నానము చేసిన గంట తర్వాత భోజనం చేయుచుండవలెను.

ఒక రాత్రి నిలువ వుండిన వంటకాలు తినకూడదు. అట్లు తినిన కళ్ళు బరువుగా మొద్దు బారినట్లు, చురుకుతనం లేకుండా వుండును.

దంతములు శుభ్రపరచుకున్న అనంతరం ఏ యితర వస్తువులూ తినకుండా 5 - 6 తులసి ఆకులు నములుట వలన జ్వరము రాకుండా వుండటే కాకుండా, జీర్ణశక్తి కూడా పెంపొందును.

Pages : 80

Write a review

Note: HTML is not translated!
Bad           Good