ఈ పుస్తకంలోని 27గురు నాయకులు విశిష్టులే కాదు, ఒకరిని మించి ఒకరు ఎవరికి వారే ఒక వ్యవస్థ. వారు ఎన్నో వ్యవస్ధల సృష్టికర్తలు, ఉద్యమకారులు, త్యాగధనులు, కర్మయోగులు. దేశ స్వాతంత్య్రానికే కాదు, అభివృద్ధికి, అసమానతల నిర్మూలనకు కృషి చేసిన ఆదర్శమూర్తులు. వారి గురించి ఎన్నిసార్లు చదివితే అన్ని కొత్త కోణాలు కనబడతాయి. అటువంటి నాయకులను మన కళ్ళ ముందుకు తెచ్చి పులకరింపచేసే పుస్తకం.