''ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి, వేసారి పోవద్ద''ని పెద్దలు చెపుతుంటారు. చల్లపల్లి ప్రజానీకం కూడా ఎవరి కోసమో ఎదురు చూడకుండా ముందుకు నడిచారు. సామాన్యుల నుంచి నాయకులు పుట్టుకొస్తారు. అందుకు చరిత్రలో మనకు అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ చిన్నతనంలో ''టీ'' అమ్ముకుని జీవించిన సంగతి మనకందరకు తెలుసు. ఆయన ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా పుట్టిన నినాదమే ''స్వచ్ఛ భారత్‌''. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు నందమూరి తారక రామారావు వారి స్వగ్రామం నిమ్మకూరు నుండి సైకిల్‌పై బిందెలతో పాలు తెచ్చి విజయవాడ గాంధీనగరం (నేటి ఫిలిం ఛాంబర్‌ ప్రాంతం)లో అమ్మి జీవనం కొనసాగించేవారు అనేది జగమెరిగిన సత్యం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, చదువు సాగించటానికి ఉదయం, సాయంత్రం ఆరు మైళ్ళు నడిచి వెళ్లేవారు. ఆయన కూడా రహదారులన్నిటిని చక్కదిద్దాలని, ''స్వచ్ఛాంధ్రప్రదేవ్‌'' నినాదం ప్రతిపాదించారు. అందుకవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వపరంగా అందిస్తున్నారు. ఆ మహనీయుల ఆశలకు, ఆశయాలకు చల్లపల్లిలో స్వచ్ఛ కార్యక్రమం యధావిధిగా కొనసాగుతున్నది.....

పేజీలు : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good