గతంలేనిదే వర్తమానం లేదు. వర్తమానం లేనిదే భవిష్యత్తులేదు. తెలుగు నాటకరంగ అభ్యున్నతికి ఎందరెందరో మహామహుల కృషి, త్యాగం, సంకల్పం దోహద పడింది. రేపటి గురించిన కార్యాచరణ కోసం గతాన్ని మననం చేసుకోవటం, సమన్వయం చేసుకోవటం, విశ్లేషించుకోవటం, విమర్శించుకోవటం అవసరం. అందుకు తగిన సమాచారాన్ని ఈ తరానికి అందుబాటులో ఉంచటానికి ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో జరగాలి. ఈ చిన్న పుస్తకంలో సంక్షిప్తంగా నాటకరంగ వికాసానికి దోహదపడిన ప్రముఖుల గురించి, వారి కృషి గురించి కొంత మేర గుర్తు చేసే ప్రయత్నం చేశాం. తగిన వ్యవధి లేని కారణంగా 200 మందిని మాత్రమే పరిచయం చేయగలిగాం. వల్లూరు శివప్రసాద్‌, గంగోత్రి సాయి

Write a review

Note: HTML is not translated!
Bad           Good