కైలాస పర్వతానికి, తిరువణ్ణామలైలోని అరుణాచలానికి ప్రదక్షిణ చేయడం చాలా మందికి తెలుసు. కాని ఓ నదికి ప్రదక్షిణం చేస్తారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. నదుల్లో కేవలం నర్మద నదికే పరిక్రమ చేస్తారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో 1312 కిలోమీటర్ల దూరం ప్రవహించే నర్మదా నదికి బస్‌లో పదహారు రోజుల పాటు పరిక్రమ చేసిన రచయిత తన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. నర్మద పరిక్రమలో దీనివల్ల కలిగే ప్రయోజనం, నర్మదా తీరంలోని వివిధ పుణ్యక్షేత్రాలు, అక్కడ బస, ఇతర వసతులు మొదలైన వివరాలు పాఠకులు ఇందులో చదవచ్చు.
హిమాలయం-మహిమాలయం లాంటి ఆధ్యాత్మిక ట్రావెలాగ్‌ అందించిన శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నుంచి వెలువడ్డ మరో ట్రావెలాగ్‌ నర్మద పరిక్రమ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good