నమో...నమో...నరేంద్ర మోడీ అనే మాట ఆ నోట ఈ నోట ప్రతి నోటా పాటై పాడింది. దేశమంతటా, కులమత భేధాలు లేకుండా చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా యువతతోపాటు భారత దేశం యావత్తు మోడీ జపంతో నిండిపోయింది. 2014 పార్లమెంటు ఎన్నికలకు ముందు ఒక సంవత్సరం పాటు దేశమంతా నలుమూలలా పర్యటన చేసి దాదాపు 400లపైగా బహిరంగ సభల్లో మాట్లాడి జనాన్ని ఆకర్షించారు మోడీ. ప్రజల్లో ఉత్సాహాన్ని, నమ్మకాన్ని కలుగజేశారు. అవినీతిలేని అభివృద్ధి లక్ష్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని2014 ఎన్నికల ముందు రాజకీయ నాయకులకు, ప్రభుత్వాలకు మాత్రమే తెలిసిన మోడీ అతి తక్కువ సమయంలో ప్రజల దృష్టిని కూడా అమితంగా ఆకర్షించారు. అభిమానులు, వ్యతిరేకులు అందరూ రోజూ మోడీ గురించి మాట్లాడారు. ఎవరు ఈ మోడీ? ప్రజాకర్షణ ఆయనకెలా లభించింది? ఒక్కసారిగా ఆయన ప్రజల్లో నమ్మకాన్ని ఎలా చూరగొన్నారు? మోడీని అన్ని కోణాల నుంచి పరిశీలించి ఈ విషయాలన్నిటినీ సంగ్రహంగా రాశారు శ్రీ లక్ష్మీప్రసాద్‌. మోడీ గురించి తెలుసుకోవాలన్న ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా తెలియజేశారు రచయిత.

ఈ పుస్తకం ద్వారా నరేంద్ర మోడీని ప్రజలకు పరిచయం చేయటమే కాక, ఎలాంటి ప్రభుత్వం ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేశారు లక్ష్మీప్రసాద్‌ గారు. హిందీ, తెలుగు భాషల్లో జగమెరిగిన పండితుడు అయినప్పటికీ చాలా సరళమైన శైలిలో మోడీ గురించి ప్రతిఒక్కరూ అర్థం చేసుకునే విధంగా రాయడం ప్రశంసనీయం, ముదావహం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good