సంస్కృత వాజ్మయసాహిత్య ప్రక్రియలు తెలుగులో విలసిల్లినా, సంస్కృతానికి చెందినా, దేని ప్రత్యేకతలు దానివిగానే, తమ ప్రత్యేక వ్యక్తిత్వంతో, విశిష్టంగా విలసిల్లాయి. అలాంటి సాహిత్య ప్రక్రియలలో శతక ప్రక్రియ ఒకటి. నాలుగు వేలకు పైగా తెలుగు శతకాలు ఉద్భవించినా, పదిమందికి గుర్తుండిపోయేవి పది, ఇరవైని మించవు. సుమతి, దాశరథి, శ్రీకాళహస్తీశ్వర శతకాలలాగా ప్రసిద్ధిలోనికి రాకపోయినా వాని తరువాత స్థానాన్ని ఆక్రమించేవాటిలో శేషప్పకవి నరసింహశతకం ఒకటి. ఈ శతకం మనరాష్ట్రంలోని కరీంనగరం జిల్లాలో గోదావరి ఒడ్డునగల ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్ర స్వామిని సంబోధిస్తూ వ్రాసిన భక్తి శతకం. ధర్మపురి ప్రఖ్యాతి వహించిన క్షేత్రము. తెలంగాణంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటి.

ఈ శతకాన్ని రచించిన కవి ధర్మపురి శేషప్ప. ధర్మపురి అనే ఇంటిపేరు ఉన్నవారు. నేటికీ అనేక కులాలలో ఉన్నారు. శేషప్పకవి ధర్మపురి క్షేత్ర నృసింహునికి మహాభక్తుడు. నృసింహ స్వామికి తన జీవితాన్ని అంకితం చేసినవాడు. నృకేసరి శతకము, నరసింహశతకము అనే రెండు శతకాలు ఈ కవి రచనములు. ఈ కవి క్రీ.శ. 1750-1800 ప్రాంతమున జీవించి ఉన్నవాడు.

పేజీలు : 128

Write a review

Note: HTML is not translated!
Bad           Good