ఇరవయ్యో శతాబ్లిలో సయితం మన పురాణాలలోని కట్టుకథలను, పిట్టకథలను మనలో అత్యధిక సంఖ్యాకులు పరమ సత్యాలుగా, వాటిలోని బొంకులను, రంకులను పవిత్ర విషయాలుగా విశ్వసించడం ఆశ్చర్యకరమైన విషయం...

మన పురాణాలను నిరసించినవారు కొందరు లేకపోలేదు గాని, వారి సంఖ్య బహుస్వల్పం. ఈ శతాబ్దిలో పెరియార్‌ రామస్వామి, త్రిపురనేని రామస్వామి పురాణాలపై దాడి చేశారు. గత శతాబ్దిలో రాజా రామమోహన్‌ రాయ్‌, దయానంద సరస్వతి వాటిపై దెబ్బ తీశారు గాని వారి విమర్శలు గాలికి ఎగిరి పోయినట్టుగా భావించవలసి వస్తుంది...

స్నానం చేయించి, వలువలు మార్చి, తలదువ్వి, జడవేసి, పూలు తురిమి, సుగంధ ద్రవ్యాలను పులిమి, పురాణాలలోని కంపును కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు...

రామాయణంలో అహల్య ఇంద్రునితో వ్యభిచరించి, ''నా జన్మ పావనమైనది. మనకు ప్రమాదం రాకుండా నా భర్త తిరిగి రాకముందే మీరు చల్లగా తప్పుకొనండి'' అని హెచ్చరించిన గాథ లేదా? ఇదే విధమైన బూతుకథలు భారతంలోనైనా ఎన్నిలేవు? కర్ణుని జన్మవృత్తాంతాన్ని, ధర్మరాజును, భీముని, అర్జునుని కుంతి ఎవరికి కన్నదో జ్ఞాపకం తెచ్చుకొనండి. ఋషిపత్నులలో కొందరు తమ భర్తలకంటే రెండాకులు ఎక్కువ చదివిన వారే. ఉదాహరణకు బృహస్పతినే తీసుకొండి - అతడు అన్న పెండ్లాన్ని చెరచగా అతడి భార్య తార చంద్రుడిని తగులు కొంటుంది. ఈ ఋషువులన్న వారిలో కొందరైనా చారిత్రక వ్యక్తులైతే వీరిని పోల్చవలసింది ఈనాటి రజనీష్‌, మహేష్‌ యోగి, సత్యసాయిబాబా, ధీరేంద్ర బ్రహ్మచారి వగైరా వగైరాలతో...

పురాణాల దుష్ప్రభావం నుంచి ఇప్పటికైనా మనం బయట పడలేకపోతే ధర్మశాస్త్రాలను భస్మీపటలం చేయకపోతే, కులవ్యవస్థను రూపుమాపకపోతే, హేతుదృష్టిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకొనకపోతే మనదేశం పైకి కాక క్రిందికే - మరింత క్రిందకే పోతుంది. మనలో భావవిప్లవం రానంతవరకు ఏ పంచవర్ష ప్రణాళికలు ఏ పంచసూత్రాలూ అధోగతినుంచి మనను తప్పించలేవు. - నార్ల వెంకటేశ్వరరావు

పేజీలు : 88

Write a review

Note: HTML is not translated!
Bad           Good