ప్రముఖ ప్రజా కవి సి.వి. రాసిన ''నరబలి'' వచన కవితా కావ్యం మెదళ్ళకు పదను పెట్టే ఆధునిక కావ్యం. మానవతావాదానికి ప్రాణవాయువు. కావ్యాలంకార సౌందర్యం గడబిడ లేకుండా స్వాభావిక సౌందర్యం కవితా ప్రవాహంగా సాగిన కావ్యమిది.
''నరబలి'' కావ్యం తరతరాలుగా కులమత మూఢ విశ్వౄస దోపిడీ ఆధిపత్య సంస్కృతి మానవుల మెదళ్ళలో హేతువాద ఆలోచనల విత్తనాలు మొలిపించి సమాజాన్ని సతత హరితంగా ఉంచడానికి ప్రతినిధులుగా ఉండి కృషి చేసిన వాళ్ళను బలితీసుకుంటూ హంతక దర్శకత్వాన్ని నిర్వహిస్తున్న వాస్తవాన్ని అక్షరంగా మార్చింది. ఇది ఆధునిక నిసర్గ ఇతిహాసం. నరుడు మనిషిగా, మానవుడుగా, మనీషిగా, మానవతామూర్తిగా మారే వివేచన కిరణాల వెలుతురును ప్రసరించిన ఆధునిక భావ ప్రభాకరం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good