ఒక రాజకీయ మేధావి అకథిత కథ ఇది. ఇది పి.వి.నరసింహారావు అనుకోకుండా 1991లో భారతదేశ ప్రధాని అయినప్పుడు ఆయనకు ఆర్థిక సంక్షోభమూ, హింసాయుతమైన తిరుగుబాట్లు వారసత్వంగా వచ్చాయి. దేశం దిశాహీనంగా ప్రయాణిస్తూ ఉంది. తన ప్రజలు ప్రేమించకుండానే తన పార్టీ విశ్వసించకుండానే పార్లమెంటులో మైనారిటీగా ఉండీ, 10 జనపథ్‌ నీడలో ఉండి పరిపాలిస్తూ పి.వి. దేశంలోనూ, విదేశాల్లోనూ కూడా భారతదేశాన్ని పునరావిష్కృతం చేశారు. అంత తక్కువ అధికారంతో అంత ఎక్కువ సాధించిన ప్రపంచ నాయకులు అరుదు. ఇంతవరకూ ఎవరూ చూడని పి.వి. వ్యక్తిగత పత్రాలను, 100కు పైగా ఇంటర్వ్యూలను ఆధారం చేసుకుని రచించిన ఈ జీవిత చరిత్ర భారత ఆర్థిక వ్యవస్థ, అణుకార్యక్రమం, విదేశాంగ విధానం, బాబ్రీ మసీదు సంఘటనలను గురించి అనేక సత్యాలను వెల్లడిస్తుంది. తెలంగాణలో ఒక చిన్న గ్రామం నుండి బయలుదేరి ఆయన అనుభవించిన అధికారం, అవమానం, ప్రజాజీవితం నుండి విరమణల గుండా ప్రయాణించిన ఈ పుస్తకం ఆయన లోపలి మనిషి నుండి, క్లిష్టమైన బాల్యం నుండి, అవినీతి, ప్రేమ వ్యవహారాల నుండి, ఏకాకితనం నుండి తన దృష్టిని ఎక్కడా మరలించలేదు. సూక్ష్మేక్షికతో పరిశోధించి, నిజాయితీగా చెప్పిన ఈ రాజకీయ జీవిత చరిత్ర భారతదేశ గమనాన్ని మార్చిన ఒక వ్యక్తి జీవితాన్ని గురించి ఆసక్తి వున్న ప్రతి వ్యక్తి చదవదగింది.

Pages : 448

Write a review

Note: HTML is not translated!
Bad           Good