పెరుగుతున్న జనాభా ఆధారంగా అన్ని స్థాయిలలో విద్యాలయాల సంఖ్య, విద్యార్థుల చేరిక పెరగాలి గాని తగ్గకూడదు. కాని, బడులు, కాలేజీలు మూసివేత, పిరమిడ్‌ ఆకారంలో విద్యార్థుల తరుగుదల దేనికి తార్కాణం.

ప్రగతికి మూలాధారమైన, సమాజ శ్రేయస్సుకు దోహదపడే 'విద్య' గూర్చి సూర్యనారాయణగారు ఇంత శ్రద్ధ తీసుకొని బాధ్యతగా సమాజానికి, ప్రభుత్వానికి, అధికారులకి, చేసిన విషయ సూచన ఎంతైనా అభినందించవలసిన విషయం. ఇటువంటి ప్రయత్నం, విద్యకు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధించిన వారందరిలో చైతన్యాన్ని కలిగిస్తే సమాజం బాగుపడుతుందనే వ్యాసకర్త భావన, ఆశ.

విద్యావ్యవస్థను, విద్యావిధానాన్ని సక్రమ నిర్వహణకు, ఆర్థిక, సామాజిక ఉద్ధరణకు స్వాతంత్య్రం తరువాత ముదలియార్‌ కమీషన్‌, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కమీషన్‌, కొఠారీ కమీషన్‌లతో మేధావుల ద్వారా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అవి కొంత సాధించినా, ఆశించినంత సమాజానికి మేలు జరగలేదు.

ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలు భారతదేశం కంటే ఎంతో వెనుకగా స్వాతంత్య్రం పొందినవి విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి, ఎంతో అభివృద్ధి పొందాయి. భారతదేశంలో కూడా శాస్త్ర, సాంకేతిక రంగాలలో నైపుణ్యత, ప్రఖ్యాతి పొందినవారు చాలామంది ఉన్నారు. ఇతర దేశాలలో పరిపాలనా రంగంలో భాగస్వామ్యం పొందినవారున్నారు. కానీ స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంలో ప్రాథమిక సూత్రాల ప్రకారం, అన్ని రకాలుగా అందరికి సమానత్వం సాధించాలన్నది ముఖ్యం. ఇది విద్య ద్వారానే సాధ్యం అన్నది వ్యాసకర్త భావన.

ప్రపంచ దేశాలలో యువత అత్యధికంగా గల భారతదేశంలో నైపుణ్యతతో కూడిన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించకపోతే, యువత పెడత్రోవపట్టి శాంతియుత వాతావరణాన్ని పాడుచేసే అవకాశముందని వ్యాసకర్త అభిప్రాయపడ్డారు.- ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

పేజీలు : 144

Write a review

Note: HTML is not translated!
Bad           Good