తండ్రికి కూతురంటే ఓ పిసరంత ప్రేమ ఎప్పుడూ ఎక్కువే ఉంటుందట...

ఎందుకో తెలుసా?

కూతురిలో తల్లిని చూసుకొని తాను మళ్ళీ ఆ కూతురికి బిడ్డయిపోతాడు తండ్రి

అమ్మ భూదేవి అయితే

నాన్న ఆకాశం...

భూమి, ఆకాశం మధ్యలో విరిసిన హరివిల్లు బిడ్డలు...

ఆ ఆకాశం భూమి మీద పిడుగులు కురిపిస్తే...

మెరుపులు మెరిపిస్తే....

అప్పుడు హరివిల్లు ఏమవుతుంది.

కూతురిని అపురూపంగా పెంచుకునే ప్రతి తండ్రి, తన భార్య కూడా ఓ నాన్నకి కూతురే అని, అంతే మమకారంగా పెరిగి వచ్చిందన్న సంగతి గుర్తుంచుకుంటే సంసారాలు కన్నీటిమయం కావు. అప్పుడు ఆ ఇల్లాలు నిత్యం చస్తూ బ్రతకక్కర్లేదు... ఆ పిల్లల కలలు కల్లలూ కావు.

మాటకీ ప్రాణం ఉంది కనుకనేఊ హార్ట్‌ ఎటాక్స్‌, బ్రెయిన్‌ స్ట్రోక్స్‌ వస్తున్నాయి అన్న సత్యాన్ని మనం తెలుసుకున్న రోజు మన మనసు మానవత్వంతో తీర్చిదిద్దినట్టుగా మారిపోతుంది. మన మాట మంచితనంలో అద్దినట్టుగా ఉంటుంది. జీవితం అంటే ర్యాంకులు, ఉద్యోగం, డాలర్లూ, విల్లాలు అయితే మనం అంతా ఆనందంగానే ఉండాలిగా! మరి ఉన్నామా? అంటే అటువైపు జీవితంలో ఏదో ఉంది.

ఆ ఏదో ఏంటీ?

పచ్చటి మొక్కలు, ఎగిరే సీతాకోకచిలుకలు, తోకాడించుకుంటూ ముఖం ఇంత చేసుకుని వచ్చే వీధికుక్క, సూర్యోదయం తాలూకు సంతోషం, సూర్యాస్తమయం తాలూకు సంతృప్తి..కొబ్బరి ఆకుల సందుల్లోంచి జారే వెన్నెల్లో తడుస్తూ బాల్యాన్ని నెమరువేసుకోవడం..సన్నజాజుల పరిమళం మోసుకొచ్చే కబుర్లు, వర్షంలో తడుస్తూ మట్టి వాసనను పీల్చడం..ఇదీ అటుపక్క జీవిత.ం...

రెండు ప్రక్కలా ఉన్నది మీ జీవితాలే..

రెండూ అవసరమే..

ఏది లేకపోయినా ఆనందం...ప్రశాంతత జీవితాల్లోంచి నిశ్శబ్ధంగా వెళ్ళిపోతాయి. మరి ఇటుప్రక్క జీవితం కోసం ఏం చేయాలో మీ అందరికీ తెలుసు...అటు ప్రక్క జీవితం కోసం ఏం చేయాలో తెలుసుకోవాలంటే 'నాన్న' చదివి తీరాల్సిందే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good