అత్యంత శ్రద్ధాసక్తులతో, అపారమైన ప్రేమతో పిల్లల కోసం ప్రత్యేకంగా యద్దనపూడి సులోచనారాణి శ్రమించి యేర్చికూర్చిన అద్భుత పిల్లల పేర్ల మణిహారం ఈ నామ చంద్రికలు.

వెన్నెల నవ్వులు విరబూయించే మీ ముద్దుల బిడ్డకు ఈ పుస్తకంలోంచి చక్కని వో నామ చంద్రికను ఎంచుకుని మురిసిపోండి!

ఈ పుస్తకంలో పిల్లల పేర్లతో బాటు యింకా చాలా చాలా విశేషాలున్నాయ్‌!

గర్భిణులకు సూచనలు, ప్రసవతేదీ నిర్ణయించడం ఎలా?

వుండాల్సిన ఎత్తు - బరువులు, తల్లిపాలు-ఆహార నియమాలు, టీకాల వివరాలు, పిల్లలకోసం పొదుపు పథకాలు యిలా ఎన్నో ఉపయోగకరమైన అంశాలు ప్రత్యేకంగా పొందుపరిచారు. దాదాపు 5000 పేర్లతోబాటు మీ బాబు / పాప ఫుల్‌ సైజ్‌ కలర్‌ ఫోటోకై ప్రత్యేకంగా వో పేజీ కేటాయించాం. మీకు తెలిసిన మరిన్ని కొత్త పేర్లు జోడించడానికి అదనపు ఏజీలిచ్చాం. పుస్తకం తెరవగానే మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చెయ్యడానికి చంద్రకాంతుల వెదజల్లే ముచ్చటైన పేర్లు సిద్ధంగా వున్నాయ్‌!

Write a review

Note: HTML is not translated!
Bad           Good