వివిధ సాహిత్య ఉద్యమాలు తెలుగుదేశాన్ని ఎంతో కొంతకాలంపాటు ప్రభావితంచేసి చివరకు ప్రధాన సాహిత్య స్రవంతిలో కలసిపోతూ వుంటాయి. ఈ ఉద్యమాలతో సంబంధంలేకనో వాటితో విభేదించకుండానో కేవలం జీవితాన్ని మాత్రమే పట్టుకుని ప్రయాణించే సాహిత్యం ఎప్పుడూ వుంటుంది. పతంజలి శాస్త్రిగారిది అలాంటి సాహిత్యం. చేదైన జీవితమూ, తేనైన హృదయమూ ఆయన సాహిత్యంలో ప్రధాన లక్షణంగా వుంటాయి. ఇందులోని ప్రతి కథ మూలాల్లోనూ అదే కనిపిస్తుంది. జీవితంలో చేదు మాత్రమే ప్రతిఫలించిన చోట ఏదీ తేనెగుండె అని అడిగితే అది రాసిన వాడి గుండెలో వుంది కాబట్టి ఇంత చేదు కథ పుట్టిందని సమాధనం ఇస్తాన్నేను. - కె.ఎన్.వై. పతంజలి |