స్వతంత్ర భారతదేశంలో దళిత కూలీలు వేలంపాటల్లో భూస్వాముల పరం అవుతున్నారు. స్వతంత్ర భారతదేశంలో పేద మహిళలు సారాయి అమ్ముకొని బతుకుతూ రాజ్యం చేతిలో బలైపోతున్నారు. స్వతంత్ర భారతదేశంలో, వ్యవసాయక దేశంలో పంటలు పండించుకోడానికి నీళ్లకోసం ఒక రాయలసీమ రైతు కోడలు మానాన్నీ, ప్రాణాన్నీ ఆహుతి చేయవలసి వస్తున్నది. స్వతంత్ర దేశంలో మతం పేరుమీద అమానుషత్వం రాజ్యమేలుతున్నది. ఈ నాలుగంశాలనీ శాంతినారాయణ ఈ నాలుగు నవలికలలో చిత్రించి, భ్రమలలో ఉన్నవాళ్ల కళ్లు తెరిపించాడు. ఈ నాలుగు నవలికలు, వర్తమాన భారతీయ సామాజిక వాస్తవికతకు కళారూపాలు. ది బ్యూటీ ఆఫ్‌ లైఫ్‌ ఈజ్‌ ది బ్యూటీ ఆఫ్‌ స్ట్రగుల్‌ అన్నాడు ఈస్థిటిక్స్‌ గ్రంథంలో యూరీ బోరెవ్‌. ఈ నాలుగు నవలికలూ జీవిత సంఘర్షణా సౌందర్య ప్రతిఫలనాలు. ఇవి తాలుగింజలు కావు. గట్టిగింజలు. ఇవి రాయడంలో రచయిత ధైర్యాన్నే కాదు, సాహసం కూడా చేశాడు. ఈ నాలుగు నవలికలూ ప్రాదేశికంగా కనిపిస్తూ జాతీయ స్వభావం కలిగున్నాయి. - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

పేజీలు : 210

Write a review

Note: HTML is not translated!
Bad           Good