మొదలుపెడితే చివరిదాకా మీ చేత ఆపకుండా చదివిస్తుంది ఈ పుస్తకం ! చదివి చుడండి !

*****

నాలో నేను....

ఇది నా అంతర్మధనం...

గత జీవితాన్ని తరచి చూసుకున్నప్పుడు, నాలోని రచయిత్రి, గృహిణి, నటి, చిత్రకారిణి, గాయని, సంగీత దర్శకురాలు, దర్శకురాలు, నిర్మాత, స్టూడియో నిర్వాహకురాలు, జ్యోతిష్కురాలు, చిత్రకారిణి....ఎన్నో వేర్వేరు రూపాలలో ఈ భానుమతి ఎలా ప్రతిబింబించిందో - సింహావలోకనం చేసుకున్నప్పుడు - కొన్ని తీయనివి... కొన్ని చేదైన జ్ఞాపకాలు.... ఆ జ్ఞాపకాలకు అక్షర రూపం ఇది.

నాలోని అంతర్మధనాన్ని, అనుభూతులను - నా అభిమానులతోను, పాఠకులతోను, 'విజయచిత్ర' ద్వారా పంచుకోగలిగాను. ఇప్పుడా అక్షర సత్యాలకు పుస్తకరూపం ఏర్పడడం నాకెంతో ఆనందదాయకం.

జీవితాన్ని ఇంకా ''స్టడీ'' చేయాలంటోంది నాలోని రచయిత్రి.

'సామాజిక సత్యాలకు అద్దం పట్టాలి' అంటోంది నాలోని దర్శకురాలు.

జీవిత సత్యాలను అన్వేషించేటటువంటి ఆత్మ వ్యవస్యాం కొనసాగించాలంటోంది నాలోని ఆధ్యాత్మిక తత్త్వం.

నిజమే...!

అందుకే ఇదొక అంతులేని ఆలోచనల పరంపరగా భావిస్తూ.....సెలవు తీసుకుంటున్న...

 

- భానుమతి రామకృష్ణ

Write a review

Note: HTML is not translated!
Bad           Good