మరో రోజు
ఈ దేహ వీణపైన
రహస్య తంత్రుల్ని మీటి
శృతి చేసి
ఒక రాగ సంతకాన్ని చేసినపుడు
నా ప్రపంచం నువ్వే అనుకున్నాను
అనురాగ శిఖరాల్ని అధిరోహించిన
ఆనందపు క్షణాల్ని
గుర్తుకు తెచ్చుకుంటున్నపుడు
దు:ఖపులోయలో పడి ఉంటాను
ఉలిక్కిపడి లేచి చూస్తే....
శోకం లేని లోకం కోసం
నువ్వు వెళ్ళిపోయినపుడు
నా లోకమంతా
శోకమై మిగిలి ఉంటుంది
...
నిశ్శబ్ద జీవితంలో
విషాద నిషాదం
కొందరు భగవంతుడంటున్న నువ్వు
నన్ను కాదన్నపుడు
ఈ వేదనా జీవితం
ఎవరికీ రావద్దని
ఎవరికి నివేదించను
ఏమని విన్నవించను
పేజీలు : 68