ఆచంద్రతారార్కం అని మన సంస్కృతిలో ఒక ఉవాచ. అనగా చంద్రుడు, తారలు, సూర్యుడు ఉన్నంత కాలం అని. అనగా ఎల్లప్పుడు లేదా శాశ్వతం అనే భావం.
కాని ఈ విశ్వసృష్ఠిలో ఏదీ శాశ్వతం కాదు. మన చంద్రుడు ఒక ఉపగ్రహం. అలా ఎన్నో ఉన్నాయి. విశ్వపరిధిలో అవి చాలా స్వల్పం. లేదా అల్పం. సూర్యుడు ఒక నక్షత్రం. ఒక బ్రహ్మాండమైన విపరీత ఉష్ణోగ్రతల గోళం. వాయుమయం. అన్ని నక్షత్రాలలాగా అతని జీవితకాలం సుమారు 10 కోట్ల సంవత్సరాలు. వ్యాసం 14 లక్షల కి.మీ. కాని ఇతర నక్షత్రాలు కొన్ని కోట్ల కి.మీ. వ్యాసం కలిగి ఉంటాయి. విశ్వంలో అనేక నక్షత్రాలు వెలుగొందుతూ ఉంటాయి. కాని వ్యక్తిగతంగా వాటికీ పుట్టుక, మనుగడ, మరణం ఉంటాయి. అలా పుడుతూ, మరణిస్తూ ఉంటే వాటి జనాభా మాత్రం అలా కొనసాగుతూనే వుంటుంది.
ఈ మహావిశ్వం అంతమైనపుడు అవి కూడా అంతమవుతాయి అని మనం ఊహించుకోవచ్చు. కాని వ్యక్తిగతంగా మాత్రం ఒక్కొక్కటి కనుమరుగవుతాయి. లేదా విశ్వపరిధిలో ఏవో మారుప్లఉ చెందుతాయి. కాని శత, సహస్ర కోట్లాది సంఖ్యలో ఈ మహావిశ్వంలో, పాలపుంతల్లో అవి ఎల్లప్పుడూ ప్రజ్వలిస్తూనే ఉంటాయి.
వాటి గురించి, వాటి వైవిధ్యాలు, విశేషాలు, వింతలు, విపరీత ప్రవర్తనలు క్రమంగా ఈ గ్రంథంలో తెలుసుకోవచ్చు.
- రచయిత
పేజీలు :78