కవిత్వం కవిత్వం కోసం కాదు. ఇప్పటిదాకా అత్యధికుల అస్తిత్వాన్ని వివిధ రీతుల్లో ధ్వంసం చేస్తున్న ఆధిపత్య భావ జాలానికి ప్రత్యామ్నాయ భావజాలాన్ని అది ప్రతిపాదించగలగాలి. ఈ సంకలనంలో నేను కేవలం కవిత్వం కవిత్వం కోసం రాయలేదు. నా భావజాలానికి వాహికగా కవిత్వాన్ని ఉపయోగించుకున్నాను