ఎన్ని మార్పులు వచ్చినా, మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

బ్రతుకుబాటలో పైకి కనిపించే పువ్వులన్నీ పువ్వులు కావు. ముళ్ళన్నీ ముళ్ళుకావు.

మెత్తగా, చూడసొంపుగా వుండే పువ్వు విషం పుక్కిలించవచ్చు; క్రౌర్యం వెళ్ళగ్రక్కే ముల్లు దరిజేరి చూస్తే మెత్తని పువ్వుగా మారిపోవచ్చు.

ఆధునిక స్త్రీ తన జీవితపు బాటలో వుండే యీ పూలనీ, ముళ్ళనీ గుర్తించగలిగే స్థితికి ఎదిగిందా? ఎక్కడికక్కడ పోరాడి వ్యక్తిత్వాన్ని నిలుపుకో గలుగుతుందా!

గుర్తించడంలో పొరపాటు జరిగితే ఎదురయే సమస్యల స్వరూపం ఏమిటి?

ఆధునిక స్త్రీల జీవితాల్లో ఎదురయే ప్రేమ, పెళ్ళి, పురుష ప్రపంచంలో మసలేటప్పుడు ప్రత్యక్షంగా కనిపించే విలువలు, సమస్యలు ఎన్నెన్ని రూపాల్లో వుంటాయో చెప్పడానికి, రత్న-శివరామ్‌, సాధన-చక్రపాణి, రజని-రంగారావు ప్రతినిధులు.

కథారథానికి సంఘటన జవనాశ్వాలను జోడించి ఆధునిక జీవితపు విలాసాలకూ, విలాపాలకూ ఒక ఉత్తమ రచయిత్రి పలికిన వ్యాఖ్యానం 'నాగమల్లికలు' నవల.

Pages : 192

Write a review

Note: HTML is not translated!
Bad           Good