చట్టసభల్లో నేరచరితులు ఎలా ప్రవేశించ గలుగుతున్నారు? ప్రజా ప్రతినిధి గా ఎన్నిక కావడానికి కోట్లు ఖర్చు పెట్టిన వారు ఎన్నికయ్యాక అంతకు కొన్ని రెట్లు సంపాదించకుండా ఉంటారా? కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలను పెంచిపోషించడం, తద్వారా నేతలు ప్రయోజనం పొందడం అభివృద్ధికి కొలమానమా? న్యాయ వ్యవస్థ కూడా రాజకీయ అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటున్నదా? పోలీస్ యంత్రాంగం, సిబిఐ, ఐబి వంటి ఉన్నత సంస్థలు రాజకీయ నేతల హస్తాల్లో ఉన్నందువల్లనే వారి ఆటలు సాగుతున్నాయా? పోలీసు వ్యవస్థ పేదలకు అనుకూలమా, సంపన్నులకు దాసోహమా? ఐఏఎస్ ఎవరి అడుగులకు మడుగులొత్తుతోంది? ఏ రక్షణ కుంభకోణంలోనూ సి.బి.ఐ. దర్యాప్తు ముందుకు సాగిన దాఖలాలు ఎందుకు లేవు? ప్రజలకు కనీస వైద్యసౌకర్యం కల్పించలేని ప్రభుత్వం ఏ అభివృద్ధి సాధిస్తుంది? మన విదేశీ విధానాన్ని అమెరికాకు తాకట్టుపెట్టడం నిజం కాదా?
సామాన్యులు, నిరుపేదలు, అన్నార్తులు, దళితులూ, ఆదివాసీలకు ఈ దేశంలో విలువ ఉన్నదా?
'మన ప్రజాస్వామ్యం ఒక మేడిపండు' అని భావిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ ఎ.కృష్ణారావు దేశంలో వ్యవస్థల బూటకత్వాన్ని బట్టబయలు చేస్తూ రాసిన వ్యాస పరంపరే ఈ ''నడుస్తున్న హీన చరిత్ర''.