Rs.60.00
In Stock
-
+
జనాన్ని చూసి
జనుల నాదాన్ని చూసి
హర్షామోదాన్ని చూసి, భగ్న
హృదయావేశాలను చూసి
అన్నార్తుల ఆర్తనాదాల
భయార్ణవాన్ని చూసి
అభాగినుల దీనారావాల
కరుణార్ణవాన్ని చూసి
నాలోని
రక్తనాళాలన్నీ పొంగి
ఖంగున మ్రోగి వాయువులా
విజృంభిస్తే, కన్నీళ్లు పొంగితే
మాటలు పేర్చాను
పాటలు కూర్చాను.
అవి అలలై జలలై
సెలయేళ్లై
జనం నదిలో పొంగి
ప్రవహిస్తుంటే
నదిపుట్టిన నా
గొంతుక నదిమి పట్టారు. - బొజ్జా తారకం