అట్టడుగు వర్గాలలో పుట్టి జీవితం నేర్పిన అపురూప, అరూప పాఠాల మధ్య ఉత్తమశ్రేణి కవిగా, తెలంగాణ రచయితలలో గొప్ప మానవీయ విలువలు ప్రవచించే రచయితగా యాకూబ్ రూపుదిద్దుకున్నాడనే చెప్పాలి. 'నదీమూలంలాంటి ఆ ఇల్లు!' సంపుటిలో ప్రత్యేకత ఏమిటంటే యాకూబ్ రాసిన వచన కవిత రూపంలో, సారంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఒకానొక చారిత్రక సందర్భం రూపుదిద్దుకున్నప్పుడు దాని ప్రభావం కళారూపాలపై ప్రసరించి అవి కొత్తగా రూపాంతరం చెందడం ఖాయం. గతితార్కికత అంటే అదే. పాతది రద్దయింది అంటే దాని స్థానే కొత్తది పురుడు పోసుకున్నట్లే. ఈ సంకలనంలో యాకూబ్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న వచన కవితా రూపం కొత్తది. వచన కవితకు సి. నారాయణరెడ్డి, మహాస్వప్న, అజంతా, కె. శివారెడ్డి పెట్టింది పేరు. వారివలె యాకూబ్ తన శైలిని రూపొందించుకున్నాడు. విచిత్రంగా శైలిరూపాలే కాక, కవితా వస్తువు, ఇతివృత్తాలు కూడా చాలా కొత్తవి. ప్రతీకలు, భాష మారడం కూడా చూడొచ్చు. క్లుప్తంగా రాసిన కొన్ని కవితలతో బలమైన మనోభావాలను పలికించాడు. ఒక కవితలో కొండను, మరో కవితలో చినుకును ఆలంబన చేసుకుని పొందుపరిచిన భావాలు, ఈస్తటిక్స్ దృష్ట్యా విలువైనవి. ఒకరకంగా చెప్పాలంటే కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రంలో కొత్తగా వెలువడుతున్న కవితా సంపుటి "నదీమూలంలాంటి ఆ ఇల్లు!".
- సామిడి జగన్‌రెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good