కోటాకు

ఈ పెద్దకథ యిటీవలే 'రచన' రజతోత్సవ సంచికలో (2019 ఉగాది) వచ్చింది. గ్రామీణ వాతావరణంలో సాగిన కథ అవడంవల్ల చేలగట్ల మీద, రైతుల నోళ్లలో నానే మాటల్ని పొదగడం సముచితం అన్పించింది. ఎక్కడికక్కడ పాతమాటలకి వివరణలు యిచ్చాను. 

ఇది మూడు పొరలుగా అంటుకున్న కథ. గ్రామీణ జీవితం, మధ్యలో చిగురించిన నగరీకరణ, నడుమ నలిగిన పాత కొత్త తరాలు యిందులో కనిపిస్తాయ్‌. చల్లచుక్కతో పాలు తోడుకోడానికి, ఉప్పుకల్లుతో పాలు విరగడానికి తేడా తెలియని తరం యిది. మా వూరొదిలి యాభైఏళ్లు దాటినా నేనింకా వూరి పంటకుప్పల చుట్టూ, పశువులకొష్ఠాలలో, ఆకాటలో నేదాక్కున్న బండిజల్లల కింద తిరుగుతూ వుంటాను. గొడ్లకాడి పిల్లలు ఆటలు, వాళ్లు స్వేచ్ఛగా కావించి, కల్పించి పాడుకునే బూతుపాటలు నాకింకా జ్ఞాపకం. ఈ కథ చదివి, బావుందని మెచ్చుకుంటూనే కథలో వున్న మీ వూరు నాకు చూపిస్తే... అప్పుడు బొమ్మలు ప్రయత్నిస్తానన్నారు గిరిధర్‌ గౌడ్‌. ఆదరంగా ఆనందంగా చిత్రకారుణ్ణి మా వూరు తీసికెళ్లాను. శిథిలమైపోయిన ఎడ్లబళ్లు, నాగలిదుంపలు, ప్రాణంలేని గొడ్లసావిళ్లు, బండిమోకులు యింకేవో అవశేషాలు ఆనవాళ్లు కలిసి చూశాం. గిరిధర్‌ ఇప్పటికీ పచ్చిపల్లెటూళ్లోనే వుంటున్నారు. గరువుపాలెం, చెయ్యితిరిగిన సేద్యగాడు. అన్నీ ఆయనకు తెలిసినవే, అయినా మళ్లీ చూడాల్సిందే. ప్రతి సూర్యోదయం, ప్రతి చిగురు, ప్రతి మొగ్గ కొత్తగానే పొటమరిస్తాయ్‌. ప్రకృతి రహస్యాలు తెలిసిన వర్ణయోగి గిరిధర్‌. కనుకనే యిన్ని మంచి చిత్రాలు ఆపేక్షగా యీ కథకి కూర్చారు. - శ్రీరమణ

పేజీలు : 74

Write a review

Note: HTML is not translated!
Bad           Good