నలుగురు రచయితల పదహారు కథలు 'నాల్నాలుగుల పదహారు'.

ఇద్దరు తెలుగువాళ్ళు వున్న చోట మూడు సంఘాలు ఏర్పడతాయని ఒక జోక్‌. అలాంటిది నలుగురు రచయితలు కలిసి ఒకే పుస్తకాన్ని వెలువరించడం అరుదనే చెప్పాలి. పైగా ఈ పుస్తకంగా వున్న కథలు ఒకే రకమైన భావజాలంతోనో, వాదంతోనో రాసినవి కావు. ఇందులో ప్రతి కథ ప్రత్యేకం. ప్రతి రచయిత ప్రత్యేకం. అందువల్ల ఏదో ఒక భావజాల వ్యాప్తి కోసమో, మరో ప్రతిఫలాపేక్షతోనో ఈ సంకలనం చెయ్యలేదు. కేవలం కథ మీద వున్న మమకారంతో, మంచి రచనకు పాఠకుల ఆదరణ వుంటుందన్న నమ్మకంతో మాత్రేమ ఈ పుస్తకం తీసుకురావటం జరిగింది.

- కన్నెగంటి అనసూయ, సమ్మెట ఉమాదేవి, అరిపిరాల సత్యప్రసాద్‌, వడలి రాధాకృష్ణ

Pages : 158

Write a review

Note: HTML is not translated!
Bad           Good