వైకల్పన కథల వినీలాకాశంలో ఒక కొత్త తార వెలుగొందుతోంది. ఇంతవరకు వైకల్పన బాణీలో ఒక కథో, ఒక నవలో రాసిన రచయితలు ఉన్నారు కానీ, అనిల్‌ రాయల్‌ ఈ క్షేత్రాన్ని ఒక కృషీవలుడిలా దున్నడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు సాహిత్యరంగం మీద వైకల్పనలకి ఒక సాధన లభించాలంటే ఇలా ఈ రంగంలో నాలుగు కోణాల నుండి రకరకాల కథలు రాసేవారు ఇంకా రావాలి.

    ఈ సంకలనంలో ఉన్న పది కథలూ 2009 నుండి 2014 మధ్యకాలంలో రాసినవే. రాసిలో తక్కువే అయినా వీటిలో రెండు కథలు (నాగరికథ, రీబూట్‌) బాగా గుర్తింపు పొందేయి. ఇంత తక్కువ వ్యవధిలో అనిల్‌ ఇన్ని వౌకల్పనలు రాయడమన్నదే విశేషం. దానికి తోడు వీటిల్లో రెండు కథలకి ప్రత్యేక గుర్తింపు వచ్చిందంటే దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఒకటి - సంపాదకులు పూర్వంలా వైకల్పనల మీద శీతకన్ను వెయ్యడం లేదు. రెండు- అక్షరాస్యత పెరుగుతూన్న పాఠకలోకం ఈ రకం కథలని ఆదరిస్తోంది. - వేమూరి వెంకటేశ్వరరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good