నా యెఱుక - శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు స్వీయ చరిత్ర

శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు (31-8-1864 :: 2-1-1945) నవరస విలసితమైన నవకళాప్రక్రియ హరికథకు ఆద్యులు. 1914లో శతావధాని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారి అధ్యక్షతన విద్వద్వరులు ''హరికథా పితామహ'' అన్నారు. 1928లో మద్రాసు విద్వాంసులు ''ఆంధ్రదేశ భూషణము'' అని ఏకగ్రీవంగా పలికారు. 1933లో జయపురం సంస్థానాధీశులు విక్రమదేవవర్మ ''సంగీత సాహిత్య సార్వభౌమ'', 1935లో భారతీతీర్ధవిద్యాలయం ''ఆటపాటలమేటి'' బిరుదులతో సత్కరించారు. హరికథా ప్రక్రియను శిఖరాగ్ర స్థాయికి తీసుకువెళ్ళిన వాగ్గేయకారుడు, మహామనీషి, శారదావతారం దాసుగారి స్వీయచరిత్ర 'నా యెఱుక'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good