సౌందర్యం ద్వి విధమైనది. ఒకటి దృశ్యజగత్తుకు సంబంధించినది. రెండవది అదృశ్య జగత్తుకు సంబంధించినది. పాంచభౌతిక బాహ్య ప్రపంచంలోని కొండలూ, లోయలూ, మైదానాలూ, జలపాతాలూ, సరస్సులూ, పూలూ, ఇవన్నీ అంటే మన కంటికి కనిపిస్తున్న ప్రతీది బాహ్య సౌందర్యం. అదృశ్యజగత్తంటే కనిపించని ప్రపంచమని కాదు కాని, సామాన్య చర్మచక్షువులకు కనిపించని ప్రపంచమని అర్థం. అది జ్ఞాననేత్రంతో దర్శించాల్సింది. ఆ అంతరలోకంలోనూ అనంత సౌందర్యం నిక్షిప్తమై ఉంది. ఇందులోనూ పూలు, సెలయేళ్లు, కొండలు, ధగద్ధగిత రత్నస్థగిత భవంతులూ, విశాలమైదానాలూ అసంఖ్యాకం. నిరంతర ధ్యానంలో బాహ్యప్రకృతి సౌందర్యం కూడా కనుమరుగై, కలగాపులగమై, వస్తువుల నిర్దిష్ట రూపజ్ఞానం నశించి నైరూప్యంలోకి మారినట్లే, అంతరంగంలోని దృశ్యజగుత్తు సమసిపోయి నిరాకారంలో లీనమైపోతుంది. అది సౌందర్యం నుండి జ్ఞానానికి, వస్తు పరిశీలన నుండి వస్తు నిజత్వానికి మానవుడు చేరుకున్న మజిలీ. అది జ్ఞానానికి పరాకాష్ట.
Rs.100.00
In Stock
-
+
Pages : 167