''జయ జయ జయ ఉస్మానియ విశ్వవిద్య దివ్యాలయ

మేరి వతన్‌ కో తూనే కిత్‌ నీ తెహజీబ్‌ దియా


హిందూ ముస్లిం క్రైస్తవ పారశీక సంస్కృతీ సుగంధమా

ఖండాంతర యువజన గళ విద్యా గాంధర్వమా

జ్ఞానం సంస్కృతి ఆత్మ గౌరవ సింహాసనమా

నిజాం అలీ నిలిపిన ఉన్నత విద్యా శాసనమా

శిలా శిల్ప సోయగమా మండప మణికిరీటమా

వందేమాతర జ్వాల తోరణాల ఫలకమా

వీర తెలంగాణ నుదుట సింధూరపు తిలకమా

ఎరుపెక్కిన కళ్ళు పిడికిళ్ళ అగ్ని వృక్షమా

తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన త్యాగాల పూలగుచ్ఛమా


తెలుగు ఉర్దు ఆంగ్ల బహుభాషా సంగమమా

భారతీయ సారస్వత సరస్వతీ మందిరమా

రాజనీతి న్యాయ తత్త్వవేత్తలు శాస్త్రజ్ఞులు

సాంకేతిక నిపుణులు కవులను ఇచ్చిన తల్లి

ఆధ్యాత్మిక దీపమా అధునాతన రూపమా

రాబోయే నవయువతకు పరిశోధన చదువులకు

హామీగా నిలిచిన మా హైద్రాబాద్‌ సంతకమా

ప్రపంచాన నీ కీర్తి ప్రతిష్ఠలను నిలిపేందుకు

దీక్షాదక్షులుగా మమ్ము దీవించవె జననీ

లక్ష్యసాధకులుగా నడిపించు మార్గదర్శినీ


జయ జయ జయ ఉస్మానియ విశ్వవిద్య దివ్యాలయ

మేరి వతన్‌ కో తూనే కిత్‌ నీ తెహజీబ్‌ దియా

జయ జయ జయ ఉస్మానియ విశ్వవిద్య దివ్యాలయ''

పేజీలు : 112


Write a review

Note: HTML is not translated!
Bad           Good