అత్యంత గౌరవనీయుడు, మేధావీ, రాజకీయవేత్త అయిన అబ్దుల్ కలామ్ జీవితంలోని స్పూర్తిదాయకమైన ఉదంతాలు.
రామేశ్వరంలో గడిపిన బాల్యంతో మొదలు పెట్టి దేశాధ్యక్షుడిగా ఎదగడం వరకు అబ్దుల్ కలామ్ నడిచిన దారి అసాధారణమైనది. పట్టుదలా, కృతనిశ్చయం, ధైర్య సాహసాల రహదారి........ఈ పుస్తకంలో అయన తన గతంలోని కొన్ని ముఖ్యమైనవి, కొన్ని సాధారణమైనవి అయిన అనుభవోదాంతాలను, కొందరి వ్యక్తిత్వాలను స్మరించుకుంటూ, అవి తనకు ఎట్లా స్పుర్తినిచ్చాయో సుందర సులభమైన శైలిలో చెప్పారు. తాను పెరిగి పెద్దవాడువుతున్నప్పుడు తన వ్యక్తిత్వంపై ముద్ర వేసిన వ్యక్తులను వాత్సల్య గౌరవాలతో తలుచుకున్నారు. వారితో తనకు గల సాంగత్యంలో తాను నేర్చుకున్న విలువైన పాఠాలను నెమరువేసుకున్నారు. తనకు అత్యంత ప్రేమ పాత్రుడైన తన తండ్రిని, ఆయన దైవభక్తిని వివరంగా జ్ఞాపకం చేసుకున్నారు. ఒక దేశాధ్యక్షునిగా ఎదిగిన క్రమంలో ఎదుర్కొన్న సమస్యలను, సంఘర్షణలను, చేసిన త్యాగాలను ఒక్కసారి వెనుతిరిగి చూసుకున్నారు.
వెనుకటి తీపి జ్ఞాపకలతోను, మరెంతో నిజాయితితో చెప్పిన ఈ వ్యక్తిగత అనభవ పరంపర ఒక అసాధారణమైన వ్యక్తి జీవిత కథ. ఇందులోంచి నేర్చుకోవలసిన విలువైన పాఠాలతో సహా.........

Write a review

Note: HTML is not translated!
Bad           Good