నా చిన్నతనంలో - మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధి

అలకలు, అల్లరి, అబద్ధాలు, పెంకితనం, ఆకతాయి పనులు, గిల్లి కజ్జాలు, చిల్లర మల్లర దొంగతనాలు, ఇంచుమించు బాల్యంలో పిల్లలందరూ ఒకేలా ఉంటారు. మహనీయులైనా మామూలు వాళ్ళయినా బాల్యంలో పెద్ద తేడా కనిపించదు. ఆ పిల్లవాడు శారీరకంగా బలహీనుడు. మందబుద్ధి, బిడియస్తుడు, భయస్థుడు. రాత్రి గడపటానికి భయం. చీకటిలో నిద్రించటం భయం. దొంగలంటే భయం. దయ్యాలంటే భయం. చెడు సావాసాలు పట్టాడు. బీడీలు తాగటానికి అలవాటు పడ్డాడు. అందుకోసం పైసలు దొంగిలించటం మొదలెట్టాడు. మాంస భక్షణకు అలవాటు పడ్డాడు. దురలవాట్ల వలన అప్పుల పాలై అన్న చేతి మురుగులో ముక్క కత్తిరించి అమ్మి బాకీలు తీర్చాడు. ఇంతకీ ఎవరా బాలుడు ? ఆ పిల్లవాడే పెరిగి పెద్దవాడయి భారతదేశ స్వాత్రంత్య సముపార్జనకు దిశానిర్దేశం చేసిన మహాత్మాగాంధి. దురలవాట్లు మంచిది కాదని గ్రహించి ఎలా తప్పును సవరించుకున్నాడు ? హరిశ్చంద్రుని వలె అందరూ సత్యసంధులుగా ఉండాలని ఎందుకు కోరుకున్నాడు ? అహింసా ధర్మం గురించి ఎలా గ్రహించగలిగాడు ? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే ఈ అమూల్యమైన పుస్తకం. పుట్టుకతోనే ఎవరూ గొప్పవాళ్ళుగా పుట్టరు. పెరిగే పరిసరాలు, సహవాసాలు, వ్యక్తుల ప్రభావాలు, పుస్తక పఠనం మొదలైనవి వాళ్ళను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతాయి. బాల్యానికి ఒక గొప్ప మార్గదర్శకంగా నిలిచే ఈ పుస్తకాన్ని ప్రతి విద్యార్థీ చదవాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good