ఈ పుస్తకం మర్యాదస్తుల పుస్తకం ఎంత మాత్రం కాదు. తనకు ఊహ తెలిసినప్పటి నుండి - నిరంతరం అవమానపరిచే - హత్య చేసే ప్రపంచంలో ఒక దళితుడి తీవ్రమైన తిరుగుబాటు గొంతు. ఇది కల్పిత సాహిత్యం కాదు. కటిక వాస్తవం. సాంప్రదాయిక పద్ధతికన్నా భిన్నంగా - మన సాహిత్య వాతావరణానికి అలవాటు లేని పద్ధతిలో - ఇలాంటి పుస్తకం రాయడం - ప్రచురించడం ఒక సాహసమే - ఆక్టోపస్‌లాగా, మృత్యువులా విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో - ప్రపంచ ప్రజలందరు తమ బలం, బలహీనతలను అంచనా వేసుకోవడానికి - ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి. ప్రజా పోరాటాల్లో సమస్త కులాలు, సమస్త శక్తులు భుజం భుజం కలిపి పోరాడడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది......


అసంబద్ధమైన అసమానతలమధ్య నలిగిపోయి తన జీవిత పోరాటాన్ని (బ్రతుకుదెరువూ, పరువూ, ప్రతిష్ఠలకోసం కాదు - సామాజిక న్యాయం కోసం) బేరీజు వేసుకున్న ప్రతి ఆలోచనాపరుడికీ ఏదో ఒక సమయంలో ఓ సందేహం రాక తప్పదు. దాన్ని డా|| గోపీనాథ్‌ వ్యక్తీకరించిన తీరు గుండెలు పిండేస్తుంది. - విద్యాసాగర్‌ అంగలకుర్తి

Pages : 164

Write a review

Note: HTML is not translated!
Bad           Good