2000 సంవత్సరం చివర్లో అహ్మదబాద్‌లోని ఒక యువకుడు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కలగంటాడు. తన మిత్రులు ఇష్‌, ఓమీల అభిరుచులకి అనుగుణంగా ఒక క్రికెట్‌ షాప్‌ తెరుస్తాడు. అయితే ఆ కల్లోల నగరంలో ఏది సవ్యంగా జరుగదు. తమ లక్ష్యాలను సాధించటం కోసం వాళ్ళు మత రాజకీయాలనీ, దుర్ఘటనలనీ, నిరాకరించబడిన ప్రేమనీ, వీటన్నింటికీ మించి తామే చేసే పొరపాట్లనీ ఎదుర్కోవలసి వస్తుంది. వాళ్ళు లక్ష్యం చేరుకుంటారా? వాస్తవ జీవితంలోని భయంకర సంఘటనలపై ఒక వ్యక్తి కలలు విజయం సాధించగలవా? కొన్ని పొరపాట్లు జరిగినప్పటికీ మనం విజయం సాధించగలమా?

రచయిత చేతన్‌ భగత్‌ ఆధునిక భారతదేశం మీద రాసిన మరో హాస్య విషాద మిళితమైన ఈ కథ మొత్తం తరంలోని ఏకాంకతత్వాన్ని జీవిత విలువలని మన ముందుంచుతుంది. ది త్రీ మిస్టేక్స్‌ ఆఫ్‌ మై లైఫ్‌ అనే ఇంగ్లీషు నవల అది. తెలుగు సేత, అనువాదం : ఆర్‌.శాంతసుందరి

Write a review

Note: HTML is not translated!
Bad           Good