కవులందరూ భావాలను సిరాలో రంగరించి మనముందుంచుతూ, భాషమూలాల్ని, మాటల మూలాల్ని శోధించే కళ్ళజోడుతో ప్రపంచానికి పరిచయం అవుతారు. చదివే మనకు, వినేమనసుకు కొత్త కవితా ప్రపంచాన్ని పరిచయం చేస్తారు. నా బాల్కనీ నుంచి అంటు కలం పట్టి, కలానికి నడక నేర్పి, సరైన నడతనేర్పి, కలమనే హలంతో సాహితీ సస్యాన్ని పండిస్తూ, "నా బాల్కనీ నుంచి" అంటు కవితా ప్రపంచానికి పరిచయం కాబోతున్న రావుగారు కాసరెల్లికి ఇవే మా శుభాకాంక్షంలు, విజయోత్సవ ఆకాంక్షలు. - రచయిత ప్రకాష్‌ మొల్లవోలు 

నా బాల్కనీ నుంచి అనే ఈ కవితా సంపుటిలో మనకి చాలా భావాలు కనిపిస్తాయి. కొన్నింటిలో ప్రేమ, కొన్నింటిలో స్నేహం, కొన్నింటిలో ప్రకృతి. కాని చాలా కవితల్లో మనకి మనమే కనిపిస్తుంటాము. అదే రావుగారి కవితల ప్రత్యేకత. -  శివజ్ఞాని, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ 

రావుగారు కవిని కాదంటూనే, కలం కదలటంలేదు అంటూనే ఆడదాని మనసు అర్థంచేసుకునేదెవ్వరు అని ప్రశ్నిస్తాడు, వరకట్నం వెర్రితనం అంటాడు, కలం కాగితపుచిన్నదాన్ని ముద్దాడుతుందంటాడు. ఉగాది పచ్చడి నేనే అంటాడు, మీరెవరైనా చూశారా ఆ అందాన్ని అని మనల్నే అడుగుతాడు. బాల్కనీలో కూర్చుంటే నాయనమ్మ ముక్కెర గురుతొస్తుందని మురిసిపోతాడు. ఏదో మదిని తాకిందంటూ గంతులేస్తాడు. -  ప్రసాద్‌ కల్లేపల్లి పబ్లిషర్‌, ఫోటోగ్రాఫర్‌ 

Write a review

Note: HTML is not translated!
Bad           Good