ఎన్నారై కబుర్లు (మరొటి)
'అమెరికాలో ఐదేళ్ళుండి వెనక్కి వచ్చేస్తాం!'
'ఉన్న ఇద్దరు పిల్లలనీ పరదేశానికి అర్పించి, ఈ వయసులో ఒంటరిగా ఇక్కడే కాలం వెళ్ళబుచ్చుదామనుకుంటున్నాం. మనవలూ మనవరాళ్ళూ పుడితే, ఓపిక వుంటే ఆరు నెలలుండి వస్తాం. లేదా వాళ్ళతో ఫోన్లోనే మాటామంతీ. మాకిక్కడ రోగమొచ్చినా రొష్టు వచ్చినా మేమిద్దరమే ఒకళ్ళకొకళ్ళం, ఎవరూ లేనివాళ్ళలా!'
'నాకు ఆరు నెలల వీసా ఇచ్చారు. ఇండియాలో నాకు రిటైర్మెంట్కి ఇంకా నాలుగేళ్ళుంది. ఇక్కడ ఏదన్నా మంచి ఉద్యోగం దొరికితే అమెరికాలోనే వుండి పోదామని వుంది. నా చదువూ క్వాలిఫికేషన్లూ మీకు తెలుసు. నాకెక్కడయినా మంచి ఉద్యోగం వస్తుందంటారా? మీరేమయినా సహాయం చేయగలరా?'
నా పాతికేళ్ళ అమెరికా అనుభవంలో, నేను చూసినవీ, నేర్చుకున్నవీ, మిత్రుల అనుభవాలూ, నాకు చేతనైన పద్ధతిలో వ్రాసి పాఠకులకు అందివ్వడం నా బాధ్యత అనిపించింది. అందుకనే ఈ ఎన్నారై కబుర్లు!
ఇది మిమ్మల్ని నవ్విస్తునే, కదిలిస్తూనే ఎంతో సమాచారం అందిస్తాయనే ఉద్దేశ్యంతో వ్రాసినవి. అవసరమైనదేదన్నా వుంటే వాడుకోండి, లేకపోతే చదివి హాయిగా నవ్వుకుని ఆనందించండి.
- సత్యం మందపాటి

Write a review

Note: HTML is not translated!
Bad           Good