క్రైమ్, సస్పెన్స్, పోలీస్ ప్రొసీజర్, మిస్టరీ మొదలైన కథల లక్ష్యం ఒక్కటే. అది పాఠకుల్లో ఉత్కంఠని రేకెత్తించి, చివరి దాకా ఏక బిగిన చదివించి, ఎదురు చూడని మలుపుతో కథ ముగియడం. ఓ చాక్లెట్‌ని చప్పరిస్తూంటే చివర్లో బాదం పప్పు, జీడి పప్పు, కిస్మిస్ లేదా వేరుశెనగ పప్పుల్లో ఏది వస్తుందో తినే వాడికి చివరి దాకా తెలీదు. అలాగే ఈ కథల్లోని ముగింపు కూడా పాఠకులకి ముందుగా తెలీదు. వేటి రుచి వాటివే. ఇందువల్ల ముగింపుని ముందుగా ఊహించలేక పోవడంతో 'ఓ మంచి కథని చదివాను' అనే తృప్తి పాఠకుల్లో కలుగుతుంది.
ఈ సంపుటిలోని కథలన్నీ ప్లేబాయ్, న్యూయార్కర్, ది అట్లాంటిక్ మంత్లీ లాంటి ఎన్నో అమెరికన్ పత్రికల్లో తొలుత ప్రచురింప బడ్డవే. ఓ కథ చదివాక ఇంకో కథని చదవాలనే ఆసక్తిని రేకెత్తించే కథలే.
మంచి కథల్లో ఎన్నో దినుసులు ఉంటాయి. కాని ఆ దినుసులు ఉన్నవి అన్నీ మంచి కథలు కావు. మంచి దినుసులున్న, ఒకో కథని ఐదు నిమిషాల్లోగా చదివేసే అనేక మంచి కథలని ఈ మిస్టరీ స్టోరీస్‌లో పాఠకులు చదవచ్చు.
Rs.120.00
Out Of Stock
-
+