1964లో తొలిసారి ప్రచురితమై స్వర్ణోత్సవం చేసుకుంటున్న నవల.
తెలంగాణ మాండలికంలో రచించిన తొలి నవల.
చేనేత పనివారి కుటుంబంలో పుట్టాడు చంద్రయ్య.  చదువు సంధ్యలకోసం ఉబలాటపడతాడు.  మేనమామ కూతురు ముత్యాలుతో స్నేహంగా ఉంటాడు.  ఆమె ఉంగరం తన వేలికి పెట్టుకొని పోగొడతాడు.  తండ్రికి, మామకు భయపడి పరారి అవుతాడు.  ముత్యాలు బావకోసం ఎదురుచూస్తూ ఉంటుంది.  బతకమ్మపండగ అవుతుంది.  ముత్యాలు ఉంగరం నీళ్ళకుంటలో దొరుకుతుంది.  చంద్రయ్య తిరిగి వస్తాడు. కాని, ముత్యాలుకు రాముతో పెండ్లి నిశ్చయమవుతుంది. చంద్రయ్య నేసిన 'ముత్యాల పందిరి' ఎందుకో?

Write a review

Note: HTML is not translated!
Bad           Good