చాలా మందికి ఆర్ధికంగా ఎదగాలి అనే ఆలోచన ఉంటుంది. దాని కోసం వారి ఇన్వెస్ట్ మెంట్ లో కొంత భాగం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దాని పై పూర్తీ అవగాహన ఉండాలి. అంటే కాకుండా సమయం కూడా కేటాయించగలగాలి. ఎవరికైతే స్టాక్ మార్కెట్ పై పూర్తీ అవగాహన ఉండదో, అదే విధంగా సమయం కేటాయించ లేరో అలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగా ఉపయోగాపడుతాయి మీకు ఈ పుస్తకంలో అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి. అవి ఏ విధంగా ఏర్పడ్డాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఎలాంటి పధకాలు అందుబాటులో ఉన్నాయి. ? ఏ పదకాలలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయి? సిప్ అంటే ఏమిటి ? క్రమం తప్పకుండా సిప్ లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయడం వలన ఏ విధమైన అద్భుత లాభాలు కలుగుతాయో వివరించడం జరిగింది. ఈ పుస్తకం చదవడం వలన మ్యూచువల్ ఫండ్స్ పై పూర్తీ అవగాహన కలుగుతుంది.