ఈ కథలు భారతదేశచరిత్రలో స్వాతంత్య్రానంతర రెండవదశకు చెందినవి. అంటే అత్యవసరపరిస్థితి చీకటిరోజుల తర్వాతి కాలానికి చెందినవి. స్వాతంత్య్రానంతర రెండవదశలో భారతదేశంలో రాజకీయంగా చాలా చాలా పరిణామాలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీల సుడిగాలి వీచింది. అణగారిన వర్గాల ప్రజల, కుల, మత, జండర్‌, ప్రాంత, భాషా చైతన్యాలు పెల్లుబికాయి. ఆధిపత్యధోరణి కూడా తక్కువ తినలేదు. రాజకీయ అస్థిరత పెరిగింది. ఏవేవో రాజకీయ పరిణామాలు సంభవిస్తున్నా సామాజిక సమస్యలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. పాలకులు మారుతున్నా, నినాదాలు, విధానాలు మారుతున్నా సమస్యలు సమస్యలుగానే కొనసాగుతున్నాయి. కుర్చీలలో కూర్చునేవాళ్ళు మారుతున్నారుగానీ, కుర్చీ స్వభావం మారలేదు. పునాదిలో మార్పులేని రాజ్యస్వభావం ఇలాగే ఉంటుంది. ఈ రాజ్య స్వభావాన్నే హయాత్‌ తన కథల్లో చిత్రించారు. శాసన, కార్యనిర్వహణ, న్యాయవ్యవస్థలనే మూల స్తంభాలకింద నలిగిపోతున్న మనుషుల బతుకుల చిత్రాలు హయాత్‌ కథలు....

పేజీలు : 228

Write a review

Note: HTML is not translated!
Bad           Good