సీమ సాహిత్యానికి పెద్ద దిక్కుగా, మార్గదర్శిగా ఎందరో చిన్న పెద్ద రచయితల్ని నిండు మనస్సుతో వెన్నుతట్టి ప్రోత్సహించాడు, అభినందించాడు సింగమనేని. వారిని నికరంగా విలువ గట్టాడు. విలువైన సూచన లిచ్చాడు. అప్పటికే ప్రఖ్యాతులైన రచయితల్ని హృదయానికి హత్తుకున్నాడు. ఈ క్రమంలో ''మున్నుడి'' చల్లని జల్లుల మబ్బులా తోచింది నాకు. దాని కూరిమి వానలో తడిసి ఎన్నో లేత మొక్కలు, ఎదిగిన చెట్లు, మహావృక్షాలు కళకళలాడాయి. - డా|| పాపినేని శివశంకర్‌

సింగమనేని గారి మున్నుడిలోని ముందు మాటలు సాహిత్య పాఠకులకు దిక్సూచిగా ఉపయోగపడతాయి. ముందుమాట రచనకు అవి నమూనాలుగా వున్నాయి. ఆయన ముందుమాట రాసిన కథాసంపుటాలు, నవలలు, కవితా సంపుటాలు లేదా సామాజిక గ్రంథాలు బాధిత మానవుల, సమూహాల వేదనలు, భయాలు, ఆశలు, ఆకాంక్షల కూడలిగా వున్నాయని మనకు అర్థమవుతుంది. ఆయా రచనలు ప్రజల పక్షాన వారి మానవీయ ప్రజాస్వామిక, స్వాభిమాన, స్వావలంబన జీవన కాంక్షలకు దన్నుగా నిలబడినాయని తెలుస్తుంది. - బి.సూర్యసాగర్‌

పేజీలు : 142

Write a review

Note: HTML is not translated!
Bad           Good