పురుషుడు మాత్రమే బలమైనవాడు, బుద్ధికుశలుడు, అన్యాయాలని సరిదిద్దగల్గినవాడు, కథని తన ఉనికితో ముందుకుకి నడిపించగలిగినవాడు, పురుషుడే నాయకుడు...పోరాటయోధుడు.... అన్న పాపులర్‌ దృక్పథం నించి విడివడి...మునెమ్మలాంటి సాధారణ స్త్రీలోని అసాధారణ శక్తిని బయటకు తీసి కథని నడిపిస్తారు రచయిత. -జయప్రభ

మునెమ్మ జయరాముడిని ఏకాంత క్షణాల్లో మోహం కమ్మిన వేళల్లో 'పిలగాడా' అని సంబోధిస్తుంది. జయరాముడి మరణం తరువాత బొల్లిగిత్తను కూడా 'పిలగాడా' అనే పిలుస్తుంది. పరోక్షంగా భర్త మరణానికి కారణమైన బొల్లిగిత్త... ఆ భర్త స్థానాన్ని భర్తీ చేయడం నవలగా ఈ కథాంశం సాధించిన పోయెటిక్‌ జస్టిస్‌. - అంబటి సురేంద్రరాజు

Write a review

Note: HTML is not translated!
Bad           Good