ముందే మేలుకో (వైద్య విజ్ఞాన కథలు) - వల్లూరు శివప్రసాద్‌

తన చుట్టూ జీవితాన్ని కదిలించే సంఘటనల్ని నిశితంగా పరిశీలించలేనివాడు కథకుడుగా రాణించలేడు. కదిలిపోయి, కలవరాన్నంతా తక్షణమే కాగితాల మీద కక్కేసినా కళాత్మక విలువలు లుప్తమవుతాయి. శిల్పానికీ శైలికీ లోపం చేయకుండా ఆ 'కదలిక'ను కాయితం మీదకి బట్వాడా చేయాలి. అతడే రచయితగా కథకుడుగా కృతకృత్యుడవుతాడు. అలా కృతకృత్యుడైన చిత్త శుద్ధి కలిగిన రచయిత శివప్రసాద్‌. - డాక్టర్‌ పరుచూరి రాజారామ్‌, 28-5-1987.

ఒక తరం పాఠకులకి శివప్రసాద్‌ సుపరిచితుడు మాత్రమే కాదు. అభిమాన రచయిత కూడా. నలభైయాభై కథలు రాసి, వాటిలో పన్నెండు పదమూడు కథలకి బహుమతులు పొందిన వాడు. వారి 'తాజ్‌మహల్‌', 'కురిసిన మబ్బు' వంటి కథలు చాలా ప్రసిద్ధి పొంది, పలువురు ప్రముఖుల ప్రశంసలు పొందాయి. ప్రదర్శన యోగ్యమైన అనేక నాటికలూ రాశారు శివప్రసాద్‌. వాటికి పరిషత్తుల్లో పొగడ్తలూ, బహుమతులు లభించాయి. బాల సాహిత్యంలోనూ కృషి చేశారు వారు. వారి 'రేపటి పౌరులు' నవల కూడా పాఠకుల్ని అలరించింది. - విహారి, ఆంధ్రప్రభ, 20 జులై, 2009.

Write a review

Note: HTML is not translated!
Bad           Good