రమణ నిస్సందేహంగా సాహిత్యకారులే!కథకుడుగా, విమర్శకుడుగా, వ్యాసకర్తగా, అనువాదకర్తగా చేవ చూపిన వారే! కానీ ఆయన పేరు జనాల నొళ్ళలో ఇప్పటికీ నానుతోందంటే దానికి కారణం - సినీరంగమే! సినిమాలలోకి వచ్చి 'రాయని భాస్కరుడై' రమణ కథారంగానికి అన్యాయం చెశారని వేలాది సాహితీప్రియులు వాపోవచ్చుకాక! కానీ కోట్లాది ప్రజలకు రమణను చేరువ చెసింది చిత్రపరిశ్రమే! ఓ మాదిరి చదువుకున్నవారిలో ఎంతమంది 'కానుక ' తెలుసు? ఎంతమందికి 'రాజకీయ బేతాళ పంచవతి ' తెలుసు? అదే దారిలో కొనసాగివుంటే రమణ పేరు డ్రాయింగ్ రూమ్స్ లో మాత్రం వినబడుతూ ఉండదేమో! ఈనాడు జనాభాలో ఎంత శాతం మందికి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, బుచ్చిబాబు, కుటుంబరావు వంటి గొప్ప కథకుల పేర్లు తెలుసు?
కానీ చాడువుకోనివారు సైతం రమణ పేరు గుర్తుపెట్టుకునేట్లా చేసినవి - ఓ 'బుద్ధిమంతుడు', ఓ 'ముత్యాలముగ్గు', ఓ 'సంపూర్ణ రామాయణం, ఓ 'పెళ్ళిపుస్తకం'! 'బాపు సినిమా' అనే ఓ శైలి , ఓ స్కూలు అఫ్ థాట్, ఏర్పడిపొయింది. ఎంతో గహనమైన విషయాన్ని కూడా సులభమైన సరళిలో చెప్పడం, సున్నితమైన చమత్కారం, ఆరోగ్యకరమైన హాస్యం, కళను ఉద్ధరిస్తున్నట్లు హంగామా చేయకుండా కళాత్మకమైన చిత్రీకరణ, సహజత్వానికి దగ్గరగా ఉంటూనే కుటుంబ సమేతంగా చూడగల కమర్షియల్ సినిమా  తీయగలగడం, సంగీత సాహిత్యాలకు ప్రాధాన్యత నివ్వడం - ఇవన్నీ బాపు - రమణ సినిమాల హాల్ మర్క్ అయి పోయాయి . ఇప్పుడు బుల్లితెరపై వస్తున్న 'భాగవతం' ధర్మమాని  ఇంటింటా బాపు - రమణల పేర్లు మారు మ్రోగుతున్నయి.అందువల్ల సినిమారచనే  రమణ స్వధర్మం అనవచ్చు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good