దీనిలో కనబడే మొదటిరచన రమణ తోలిరచన. 1945 లో ''బాల'' పత్రికలో ప్రచురించబడింది. అప్పటికి రమణకు 14 ఏళ్ళు. యాదృశ్చికంగా అదే సంచికలో ఆయన కంటే రెండున్నర యేళ్ళు చిన్నవాడైన బాపు కూడా వేసిన బొమ్మ కూడా అచ్చయ్యింది. ఆ విధంగా వారిద్దరి అనుబంధానికి 'బాల' పత్రికలో అంకురార్పణ జరిగింది. ఆ అనుబంధానికి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 1995లో 'బొమ్మా-బొరుసు' అనే పేరుతొ ఓ సంకలనం వెలువడింది. దానిలో ఈ రెండింటితోబాటు అప్పటిదాకా పుస్తకరూపంలోరాని రమణ రచనలు కొన్నిటిని దానిలో చేర్చడం జరిగింది. దానికి ముందుమాటగా రాసుకున్నఆత్మ (ల) కథే వ్యాస రమణీయంలోని 'జేజేలు'.
తక్కినవి రమణ 'రాయని భాస్కరుడి'గా పేరు తెచ్చుకున్నాక రాసినవి. నిజానికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే 1953 నుండి ఆరేళ్ళపాటు విస్తృతంగా రాసిన రమణ సినిమాల్లోకి వెళ్ళగానే కథల జోలికి పోకపోవడం.
ఎప్పుడైనా రాయబుద్దేస్తే రాసిన వైవిధ్య రచనలు ఈ ప్రకరణంలో కనబడతాయి. ఈ సాహిత్య ప్రక్రియకు విజ్ఞులు కొత్త పేరు పెట్టాలి. ఆంధ్రప్రభ వీక్లికై రాసిన 'అపార్ధసారధి' సీన్స్ కటింగ్ అదీ సినిమా టేక్నిక్కును తలపింపజేస్తుంది. 'శృంగారచంక్రమణం' చాలా పరిణితి చెందిన రచన. శృంగారంలోని ఎన్నో కోణాలను స్ప్రుశించడమే కాదు, కోటబుల్ కోట్స్, ప్యారడీకోట్స్ అన్నీకలిసి అదొక వినూత్న రచనగా తయారయింది. 'రచన' పత్రికలో తొలిసారిగా అచ్చయి 'లీలా జనార్ధనమ్' పుస్తకంలో ఓ వ్యాసంగా చేర్చబడింది. 'లెటరేచర్ ' విభిన్నతరహా ప్రక్రియ. 'జ్యోతి' మాసపత్రికలో కొంతకాలం శీర్షికగా నడిపారు. దానిలో చివరగా కనబదే రచన ఈ పుస్తకం కోసం రాసిందే!
Rs.165.00
Out Of Stock
-
+