Rs.200.00
In Stock
-
+
సాధారణంగా రమణగారి కథల్లోని వస్తువులు సార్వకాలికాలుగా ఉంటాయి. అందుకే ఆ కథలు ఎప్పటికప్పుడు నిత్యనూతనం అనిపిస్తాయి. రచయితలు సామాజిక మార్పును ఆశిస్తారు. అందుకు తమ రచనల ద్వారా తమ పాఠకవర్గాన్ని మేల్కొల్పాలని కృషి చేస్తారు. అలాగే రమణగారి పాఠకులు మధ్య తరగతి వర్గం. రమణగారు ఆశించిన మార్పు - ఏయే సామాజిక తాత్వికతలలో, ఎక్కడ రావాలో పాఠకులకు - ఇదిగో ఇక్కడ... ఇక్కడ అంటూ పనులు సాధించుకోగలమన్న ధైర్యం ఉంటుంది. ఉన్నత వార్గలకు డబ్బే అన్నీ సాధించి పెడ్తుందన్న ధీమా ఉంటుంది. ఈ రెండూ లేక కలలు భోంచేస్తూ, ఎవరన్నా తట్తే తప్ప లేవలేనిది మధ్య తరగతి. ఆ మధ్య తరగతిలో సామాజిక చైతన్య స్ఫూర్తి కలిగిస్తే సామాజిక రుగ్మతలు కొంతవరకన్నా తగ్గవచ్చని రమణగారి రచనాధ్యేయం. వీరివి పెద్ద కథలు. ఎమ్బీయస్ ప్రసాద్ సంపాదక బాధ్యత స్వచ్ఛందంగా నిర్వహించేందుకు అంగీకరించిన తరువాత ఈ కథారమణీయం-1. ఇది ప్రధమ సంపుటం. ఇందులో 8 అధ్యాయాలూ, 41 కథలూ ఉన్నాయి.- ఏటుకూరి ప్రసాద్.