అయితే ఇది దేశసరిహద్దులకు పరిమితమైన కథలు కావు. తాత్వికులూ, దార్శనికులూ, ప్రతిభావంతులైన మేధావులూ, సంస్కర్తలూ, విప్లవకార్యాచరణలో భాగంగా రాసిన విప్లవ రచయితలూ సృష్టించిన నిప్పురవ్వలు.

అన్ని కథలూ ముక్కుకు తాడేసి చదివిస్తాయి. దేనికదే కథాకథన నైపుణ్యానికి పరాకాష్ఠ. వ్యంగ్యం, హాస్యం, సామాజిక విమర్శ, పఠితల మనసుల్ని కలచి వేసే విషాద దృశ్యాల ఆర్థ్రతా వున్న విశ్వసాహిత్యంలోని కొన్ని ఆణిముత్యాలు.

బెర్ట్రండ్‌ రసెల్‌, ఎ.ఇ.డబ్ల్యు మేసన్‌, సోమర్‌సెట్‌ మామ్‌, లూ సున్‌, లావో షీ, కోట్స్యుబిన్‌స్కీ, ఇసాక్‌ బేబెల్‌, కర్ట్‌ కుసెన్‌బర్గ్‌, ¬వర్డ్‌ ఫాస్ట్‌, డొరొథీ పార్కర్‌, కాల్డెరాన్‌, షిగా నమోగా, ఫెరెంక్‌ మోల్నార్‌, జానెట్‌ ఫ్రేం వంటి ప్రఖ్యాత రచయితల జీవనఫలాల తెలుగు అనువాదాలు ఈ కథలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good